పవన్‌కు బహుమతి

ABN , Publish Date - Jun 16 , 2024 | 05:20 AM

పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి.. ఇటీవలే ఉప ముఖ్యమంత్రి హోదానూ దక్కించుకున్నారు పవన్‌కల్యాణ్‌. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు...

పవన్‌కు బహుమతి

పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి.. ఇటీవలే ఉప ముఖ్యమంత్రి హోదానూ దక్కించుకున్నారు పవన్‌కల్యాణ్‌. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆయన తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. అక్కడ చిరంజీవి సతీమణి సురేఖ పవన్‌కు విలువైన మాంట్‌బ్లాంక్‌ పెన్నును బహుమతిగా ఇచ్చారు. ‘‘తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తావని ఆశిస్తూ.. ఆశీర్వదిస్తున్నాం’’ అని చిరంజీవి, సురేఖ అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, సురేఖ, అన్నా లెజినోవా, పవన్‌ కలసి ఫొటో దిగారు.

Updated Date - Jun 16 , 2024 | 05:20 AM