గీతాంజలి వస్తోంది

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:54 AM

అంజలి టైటిల్‌ పాత్ర లో నటిస్తున్న హారర్‌ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రానికి ఇది సీక్వెల్‌. శివ తుర్లపాటి దర్శకుడు. కోన వెంకట్‌ కథను అందిస్తూ, నిర్మిస్తున్నారు...

గీతాంజలి వస్తోంది

అంజలి టైటిల్‌ పాత్ర లో నటిస్తున్న హారర్‌ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రానికి ఇది సీక్వెల్‌. శివ తుర్లపాటి దర్శకుడు. కోన వెంకట్‌ కథను అందిస్తూ, నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే చిత్రబృందం టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘గీతాంజలి’ ముగింపు నుంచి సీక్వెల్‌ ప్రారంభమవుతుంది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం’ అని కోన వెంకట్‌ చెప్పారు. శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేశ్‌, సునీల్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ రాహుల్‌ మాధవ్‌ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు. సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ

Updated Date - Feb 27 , 2024 | 04:54 AM