విశ్వంభర కోసం సన్నద్ధం

ABN , Publish Date - Feb 02 , 2024 | 02:59 AM

చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుండడంతో...

విశ్వంభర కోసం సన్నద్ధం

చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుండడంతో చిత్రీకరణలో పాల్గొనేందుకు చిరంజీవి సన్నద్ధమవుతున్నారు. సరికొత్త లుక్‌లో కనిపించేందుకు జిమ్‌లో కసరత్తు మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను గురువారం ఆయన సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ‘విశ్వంభర’ కోసం సిద్ధమవుతున్నానని ఆ వీడియోలో చిరంజీవి తెలిపారు. యువీ క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

Updated Date - Feb 02 , 2024 | 02:59 AM