అక్టోబర్‌లో గ్యాంగ్‌స్టర్‌

ABN , Publish Date - Sep 27 , 2024 | 01:58 AM

మాఫియా ముఠాల మధ్య ఆధిపత్య పోరును సరికొత్తగా వెండితెరపై ఆవిష్కరించిన పలు చిత్రాలు విజయం అందుకున్నాయి. ఇప్పుడు ఇదే తరహా కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘గ్యాంగ్‌స్టర్‌’...

మాఫియా ముఠాల మధ్య ఆధిపత్య పోరును సరికొత్తగా వెండితెరపై ఆవిష్కరించిన పలు చిత్రాలు విజయం అందుకున్నాయి. ఇప్పుడు ఇదే తరహా కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘గ్యాంగ్‌స్టర్‌’. చంద్రశేఖర్‌ రాథోడ్‌, కాశ్వీ కాంచన్‌ జంటగా నటిస్తున్నారు. చంద్రశేఖర్‌ రాథోడ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 25న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం గురువారం ప్రకటించింది. ఈ సందర్భంగా రచయిత సాయిమాధవ్‌ బుర్రా చేతుల మీదుగా రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను యూనిట్‌ విడుదల చేసింది. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ప్రేక్షకలను ఆకట్టుకునేలా ఉంటుందనీ, కథలోని మలుపులు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని చంద్రశేఖర్‌ రాథోడ్‌ తెలిపారు.

Updated Date - Sep 27 , 2024 | 01:58 AM