ఈసారి శివాలెత్తిపోద్ది

ABN , Publish Date - Apr 28 , 2024 | 05:36 AM

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రంలో విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు...

ఈసారి శివాలెత్తిపోద్ది

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రంలో విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మే 17న విడుదలవుతోంది. శనివారం ఈ చిత్రం టీజర్‌ను యూనిట్‌ విడుదల చేసింది. విష్వక్‌ లంకల రత్న అనే శక్తిమంతమైన పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘టీజర్‌లో మీరు చూసింది ఒక్కశాతమే. సినిమా అంచనాలకు మించి ఉంటుంది. హీరోగా మరో మెట్టు ఎక్కుతాను. ఈసారి శివాలెత్తిపోద్ది’ అన్నారు. నాగవంశీ మాట్లాడుతూ ‘ఇది విష్వక్‌ చాలా రోజుల తర్వాత నటించిన పక్కా మాస్‌ సినిమా. ఎన్నికల హడావిడి ముగిశాక ట్రైలర్‌ను విడుదల చేస్తాం. ‘టిల్లు స్క్వేర్‌’ స్థాయిలో బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది’ అన్నారు. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని కథానాయిక నేహాశెట్టి తెలిపారు. ఈ చిత్రంలో విష్వక్‌ విశ్వరూపం చూస్తారు అని కృష్ణ చైతన్య చెప్పారు.

Updated Date - Apr 28 , 2024 | 06:31 AM