గ్యాంగ్‌ వార్‌ సరికొత్తగా

ABN , Publish Date - Jun 29 , 2024 | 03:25 AM

చంద్రశేఖర్‌ రాథోడ్‌ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘గ్యాంగ్‌స్టర్‌’. కాశ్వీ కాంచన్‌ హీరోయిన్‌. ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది...

గ్యాంగ్‌ వార్‌ సరికొత్తగా

చంద్రశేఖర్‌ రాథోడ్‌ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘గ్యాంగ్‌స్టర్‌’. కాశ్వీ కాంచన్‌ హీరోయిన్‌. ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. శుక్రవారం ‘గ్యాంగ్‌స్టర్‌’ టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ రాథోడ్‌ మాట్లాడుతూ ‘నిర్మాత దిల్‌ రాజు, రచయిత విజయేంద్రప్రసాద్‌ మా చిత్రం టీజర్‌ను చూసి మెచ్చుకున్నారు. గ్యాంగ్‌ వార్‌ను మా సినిమాలో సరికొత్త రూపంలో చూపించబోతున్నాం’ అన్నారు.

Updated Date - Jun 29 , 2024 | 03:25 AM