మార్చిలో గామి ఆగమనం

ABN , Publish Date - Feb 08 , 2024 | 05:32 AM

విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా రూపొందుతున్న అడ్వంచర్‌ డ్రామా ‘గామి’. విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో కార్తీక్‌ శబరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ‘గామి’ చిత్రాన్ని మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల...

మార్చిలో గామి ఆగమనం

విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా రూపొందుతున్న అడ్వంచర్‌ డ్రామా ‘గామి’. విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో కార్తీక్‌ శబరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ‘గామి’ చిత్రాన్ని మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విష్వక్‌సేన్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘విద్యాధర్‌ ‘గామి’ సినిమా కోసం చాలా పరిశోధన చేశాడు. సినిమా పూర్తి చేయడానికి దాదాపు నాలుగున్నరేళ్లు పట్టింది. వారాణసిలో షూటింగ్‌ చేస్తున్నప్పుడు చాలామంది నన్ను చూసి నిజమైన అఘోరా అనుకున్నారు. నాకు ధర్మం చేశారు. ఓ ముసలామె ఆప్యాయంగా భోజనం పెట్టారు. ఈ సినిమా కోసం చాలా కష్టాలు పడ్డాం. ట్రైలర్‌ మైండ్‌బ్లోయింగ్‌గా ఉంది. సినిమా అందరినీ అలరిస్తుంది’ అన్నారు. విద్యాధర్‌ మాట్లాడుతూ ‘అఘోర శంకర్‌ హిమాలయాల్లో చేసే సాహసోపేత ప్రయాణమే ‘గామి’ కథాంశం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నించాం. విష్వక్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఏదడిగితే అది చేశారు. గడ్డకట్టించే చలిలో సైతం నటించాడు. ఈ సినిమా కోసం కుంభమేళాని చిత్రీకరించాం’ అని చెప్పారు. కార్తీక్‌ శబరీష్‌ మాట్లాడుతూ ‘2018లో ఈ సినిమాను మొదలుపెట్టాం. చాలా ఎగ్జయిటింగ్‌ కంటెంట్‌ ఉన్న సినిమా ఇద’ని తెలిపారు. ఈ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. ఎంజి అభినయ, హారిక, మహ్మద్‌ సమద్‌ ముఖ్య తారాగణం. సంగీతం: నరేశ్‌ కుమారన్‌.

Updated Date - Feb 08 , 2024 | 05:32 AM