గామి వింత గమ్యం

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:50 AM

విష్వక్‌సేన్‌ అఘోరా పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గామి’. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో దూకుడు పెంచింది. ‘గమ్యాన్నే’ అంటూ...

గామి వింత గమ్యం

విష్వక్‌సేన్‌ అఘోరా పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గామి’. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో దూకుడు పెంచింది. ‘గమ్యాన్నే’ అంటూ సాగే తొలి గీతాన్ని యూనిట్‌ ఇటీవలే విడుదల చేసింది. సనాపతి భరద్వాజ పాత్రుడు సాహిత్యం అందించారు. స్వీకర్‌ అగస్తీ స్వరాలు సమకూర్చడంతో పాటు అనురాగ్‌ కులకర్ణితో కలసి ఆలపించారు. విద్యాధర్‌ కులకర్ణి దర్శకత్వంలో కార్తీక్‌ శబరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. చాందినీ చౌదరి కథానాయిక. ఈ నెల 29న ట్రైలర్‌ విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం సోమవారం తెలిపింది. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో విష్వక్‌సేన్‌, అఘోరాలు దేనినో తీక్షణంగా చూస్తూ కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచింది.

Updated Date - Feb 27 , 2024 | 04:50 AM