గామి నిర్మాణం.. సాహస ప్రయాణం

ABN , Publish Date - Mar 05 , 2024 | 02:26 AM

విశ్వక్‌సేన్‌ నటించిన ‘గామి’ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ చిత్ర కథానాయిక చాందినీ చౌదరి సోమవారం విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు...

గామి నిర్మాణం.. సాహస ప్రయాణం

విశ్వక్‌సేన్‌ నటించిన ‘గామి’ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ చిత్ర కథానాయిక చాందినీ చౌదరి సోమవారం విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు.

  • ‘వారణాసి, కుంభమేళ, కశ్మీర్‌, హిమాలయాలు.. ఇలా విభిన్న లొకేషన్స్‌లో షూటింగ్‌ చేశాం. ఈ టీమ్‌లో నేను ఒక్కదాన్నే అమ్మాయిని. చాలా సవాల్‌తో కూడిన సరిస్థితుల్ని ఎదుర్కొన్నాం. ముఖ్యంగా వాష్‌ రూమ్‌ ఫెసిలిటీస్‌ లేకపోవడంతో నీళ్లు కూడా తాగేదాన్ని కాదు. దాదాపు నెల రోజుల పాటు అలా షూటింగ్‌ చేశాం. స్టంట్స్‌ నేనే రియల్‌గా చేశా. ఒక రకంగా చెప్పాలంటే గామి నిర్మాణం..సాహస ప్రయాణం.

  • కథ వినగానే చిత్ర నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుందని అర్థమైంది. ఎందుకంటే చాలా పెద్ద కాన్వాస్‌ ఉన్న కథ ఇది. దర్శకుడు విద్యాధర్‌ రాజీ పడని వ్యక్తి . తను అనుకున్నది వచ్చే వరకూ వదిలిపెట్టరు. షూటింగ్‌కు ఎక్కువ సమయం తీసుకున్నాం కనుకే విజువల్స్‌ అద్భుతంగా వచ్చాయి. ఇలాంటి సినిమా తెలుగులో ఇంతవరకూ రాలేదు. ఈ సినిమాను ఆదరిస్తే ఇటువంటి చిత్రాలు మరిన్ని వస్తాయి.

  • పరిశ్రమలోకి వచ్చి పదేళ్లు అయింది. ఈ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నా. ఇక్కడ ఆపకుండా ఏదో ఒకటి చేయాలి. కొన్ని సార్లు మనకి ఆప్షన్లు ఉంటాయి. కొన్ని సార్లు ఉండవు. అయినా ముందుకు సాగుతూనే ఉండాలి. పదేళ్లు కెరీర్‌ పూర్తి చేయడం నా దృష్టిలో పెద్ద డీల్‌. ఈ ఏడాది నేను నటించిన నాలుగు చిత్రాలు విడుదల అవుతాయి. వాటి వివరాలు నిర్మాతలు చెబుతారు. అలాగే ‘ఝాన్నీ’ వెబ్‌ సిరీస్‌ మరో సీజన్‌ కూడా రాబోతోంది.

Updated Date - Mar 05 , 2024 | 02:26 AM