గామి.. కొత్త ప్రయత్నం

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:07 AM

విశ్వక్‌సేన్‌, చాందినీ చౌదరి జంటగా నటించిన ‘గామి’ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విద్యాధర్‌ కాగిత మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ‘హిమాలయ పర్వతాలు, మంచు శిఖరాలు...

గామి.. కొత్త ప్రయత్నం

విశ్వక్‌సేన్‌, చాందినీ చౌదరి జంటగా నటించిన ‘గామి’ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విద్యాధర్‌ కాగిత మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ‘హిమాలయ పర్వతాలు, మంచు శిఖరాలు, అక్కడికి ప్రయాణించడం అంటే నాకు ఇష్టం. అలాగే విఠలాచార్యగారి జానపద చిత్రాలు అంటే అభిమానం. ఇవన్నీ కలసి ఓ ఆలోచనగా మారి, కథారూపం ఏర్పడ్డాయి. క్రౌడ్‌ ఫండ్‌ కోసం ఒక పిచ్‌ వీడియో తయారు చేశాం. దాని ద్వారా వచ్చిన డబ్బుతో చిత్ర నిర్మాణం ప్రారంభించాం. మా సినిమా గ్లింప్స్‌ చూసి యూవీ క్రియేషన్స్‌ వారు సపోర్ట్‌ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. హీరో విశ్వక్‌సేన్‌కు అప్పుడు సినిమాలు లేవు. ఆడిషన్స్‌ చేసి ఎంపిక చేశాం. చాలా ఓపెన్‌ మైండ్‌తో తను ఈ ప్రాజెక్ట్‌లో బాగా ఇన్‌వాల్వ్‌ అయ్యారు.’ అని చెప్పారు. చిత్ర నిర్మాణానికి ఐదేళ్లు పట్టడానికి కారణాల్ని వివరిస్తూ ‘ప్రేక్షకులకు కొత్తగా చెప్పాలనుకున్నాం కనుక ఎక్కువ పట్టిందనే భావన లేదు. విజువల్స్‌, మ్యూజిక్‌, టెక్నికల్‌ పరంగా కొత్తగా ప్రయత్నించాం.. ట్రైలర్‌ లో చూపించినట్లు సినిమాలో పాత్రలన్నీ ఆసక్తికరంగా సాగుతాయి. సినిమా అంతా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ముందు ఏం జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగిస్తుంది. యూవీ క్రియేషన్స్‌ వారు ప్రాజెక్ట్‌లో ఇన్‌వాల్వ్‌ అయిన తర్వాత ఫైనాన్షియల్‌ ఫ్రీడమ్‌ వచ్చింది. బిగ్గర్‌ స్కేల్‌లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చేసుకోవడానికి వారు అవకాశం ఇచ్చారు’ అని తెలిపారు.

Updated Date - Mar 06 , 2024 | 01:07 AM