Gama Awards: గామా అవార్డుల ప్ర‌ధానోత్స‌వం.. బాలీవుడ్‌ను మించి టాలీవుడ్ క‌థానాయిక‌ల ర‌చ్చ‌

ABN , Publish Date - Mar 06 , 2024 | 06:41 PM

దుబాయ్‌లో ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అతిరథ మహారధుల‌తో పాటు హీరోయిన్లు డింపుల్ హయతి, సంయుక్తా మీన‌న్ దక్ష నగార్కర్, ఆషిక రంగనాథ్, నేహా శెట్టి, ఫరియ అబ్దుల్లా హ‌జ‌రై సంద‌డి చేశారు.

Gama Awards: గామా అవార్డుల ప్ర‌ధానోత్స‌వం.. బాలీవుడ్‌ను మించి టాలీవుడ్ క‌థానాయిక‌ల ర‌చ్చ‌
ashika

దుబాయ్‌లో ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా తెలుగు మూవీ అవార్డ్స్ (GAMA Awards) 4th ఎడిషన్ అంగరంగ వైభవంగా జరిగింది. మార్చి 3న దుబాయ్ లోని జబిల్ పార్క్ లో ప్రెస్టీజియస్ గా ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డ్స్ వేడుకను ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ సారధ్యంలో గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు గారు గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించారు.


dimple.jpeg

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అతిరథ మహారధులు, ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి హీరోలు మంచు మనోజ్ (Manoj Manchu), నిఖిల్ సిద్ధార్థ, సందీప్ కిషన్, తేజ సజ్జ (Teja Sajja), ఆనంద్ దేవరకొండ పాల్గొన్నారు.

samyuktha.jpeg

ఇక‌.. హీరోయిన్లు డింపుల్ హయతి (Dimple Hayathi), సంయుక్తా మీన‌న్ (Samyuktha Menon) దక్ష నగార్కర్, ఆషిక రంగనాథ్(Ashika Ranganath), నేహా శెట్టి, ఫరియ అబ్దుల్లా (Faria Abdullah) తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 07:06 PM