గద్దలకొండ... తరహాలో
ABN , Publish Date - Oct 06 , 2024 | 03:03 AM
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా దర్శకుడు కరుణకుమార్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘మట్కా’. నవంబర్ 14న విడుదలవుతోంది. డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నోరా ఫతేహి,మీనాక్షి చౌదరి కథానాయికలు....
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా దర్శకుడు కరుణకుమార్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘మట్కా’. నవంబర్ 14న విడుదలవుతోంది. డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నోరా ఫతేహి,మీనాక్షి చౌదరి కథానాయికలు. నవీన్‌చంద్ర, అజయ్ ఘోష్ కీలకపాత్రలు పోషించారు. శనివారం చిత్రబృందం విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్‌లో ‘మట్కా’ టీజర్‌ను ఆవిష్కరించింది. నాలుగు విభిన్నమైన పాత్రల్లో వరుణ్‌తేజ్ మేకోవర్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ‘నేను ‘గద్దల కొండ గణేశ్’ సినిమా చేశాక చాలా మంది ‘మరోసారి అలాంటి సినిమా చేయండి’అని అడిగారు. ‘మట్కా’ కూడా అదే తరహాలో ఉండబోతోంది. నా కెరీర్‌లో గర్వపడే సినిమా అవుతుందని భావిస్తున్నాను’ అని చెప్పారు. వరుణ్‌తేజ్‌ను ఇప్పటిదాకా చూడని సరికొత్త పాత్రలో చూడబోతున్నారు అని కరుణ కుమార్ చెప్పారు.
ఇప్పటివరకూ ఒక లెక్క, ఇకపై వరుణ్ కటౌట్ మరోలెక్క అన్నట్లుగా సినిమా ఉండబోతోందని డా. విజయేందర్‌రెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ఏ. కిశోర్ కుమార్