ప్రేమ, వినోదం.. ఫంకీ
ABN, Publish Date - Dec 12 , 2024 | 05:52 AM
విష్వక్‌సేన్ హీరోగా నటించే ‘ఫంకీ’ చిత్రం షూటింగ్ బుధవారం మొదలైంది. ‘జాతిరత్నాలు’ చిత్ర దర్శకుడు అనుదీప్ కేవీ రూపొందిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
విష్వక్‌సేన్ హీరోగా నటించే ‘ఫంకీ’ చిత్రం షూటింగ్ బుధవారం మొదలైంది. ‘జాతిరత్నాలు’ చిత్ర దర్శకుడు అనుదీప్ కేవీ రూపొందిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తొలి క్లాప్ ఇచ్చి షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు. మరో దర్శకుడు కల్యాణ్ శంకర్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రేమ గుర్తులు కలిగిన ఈ పోస్టర్‌లో ‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్’ అనే పదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందనీ, అందర్నీ కడుపుబ్బా నవ్వించేలా సినిమా ఉంటుందనీ నిర్మాతలు చెప్పారు.