ఐదుగురు స్నేహితుల వినోదం

ABN , Publish Date - Jul 02 , 2024 | 12:20 AM

ఎమ్మెస్‌ చదవడానికి విదేశాలకు వెళ్లిన ఐదుగురు చిన్ననాటి స్నేహితుల మధ్య జరిగే సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ది బర్త్‌డే బాయ్‌’. రవికృష్ణ, సమీర్‌ మళ్లా, రాజీవ్‌ కనకాల ముఖ్య పాత్రలు...

ఐదుగురు స్నేహితుల వినోదం

ఎమ్మెస్‌ చదవడానికి విదేశాలకు వెళ్లిన ఐదుగురు చిన్ననాటి స్నేహితుల మధ్య జరిగే సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ది బర్త్‌డే బాయ్‌’. రవికృష్ణ, సమీర్‌ మళ్లా, రాజీవ్‌ కనకాల ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని విస్కి దర్శకత్వంలో బొమ్మా బొరుసా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు మెహర్‌ రమేశ్‌ విడుదల చేశారు. బాలుకి స్నేహితులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓపెన్‌ అయిన టీజర్‌ ఆ తర్వాత వినోదభరితంగా సాగింది. కొత్తదనం కలిగిన సినిమా అనే భావన టీజర్‌ చూశాక కలుగుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు విస్కి మాట్లాడుతూ ‘ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్రతి పాత్ర ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఐదుగురు స్నేహితులకు ఎదురైన అనుభవాలు, వాటి పర్యావసానాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.


ఈ నెల 19న సినిమాను విడుదల చేస్తాం’ అని చెప్పారు. ప్రమోదిన, వాకా మణి, రాజా అశోక్‌, వెంకటేశ్‌, సాయి అరుణ్‌, రాహుల్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఐ.భరత్‌.

Updated Date - Jul 02 , 2024 | 12:20 AM