వినోదం సందేశం కలబోతగా
ABN , Publish Date - Jun 03 , 2024 | 06:56 AM
హరీష్ బొంపెల్లి, మాన్య సలాడీ హీరో హీరోయిన్లుగా విష్ణు బొంపెల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓసీ’. బీవీఎస్ నిర్మాత. ఈ నెల 7న విడుదలవుతోంది...

హరీష్ బొంపెల్లి, మాన్య సలాడీ హీరో హీరోయిన్లుగా విష్ణు బొంపెల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓసీ’. బీవీఎస్ నిర్మాత. ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను మురళీ మోహన్ ఆవిష్కరించి, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సినిమా కోసం టీమ్ అంతా చాలా కష్టపడింది, అన్ని వర్గాల ప్రేక్షకలను అలరిస్తుంది అని దర్శకుడు చెప్పారు. సరికొత్త కథాంశంతో దర్శకుడు తెరకెక్కించారు, వినోదంతో పాటు మంచి సందేశం ఉంది అని నిర్మాత చెప్పారు. అవకాశాల కోసం వెళ్లి అవమానాల పాలైన దశ నుంచి ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు ఆనందంగా ఉందని హరీష్ బొంపెల్లి తెలిపారు.