ఫన్‌ ఫిల్డ్‌ అడ్వెంచర్‌

ABN , Publish Date - Apr 10 , 2024 | 01:49 AM

వరుస బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకుపోతున్నారు హీరో శ్రీవిష్లు. ఉగాది సందర్భంగా మంగళవారం ఆయన తన 19వ చిత్రాన్ని ప్రారంభించారు. దిల్‌రాజు క్లాప్‌ కొట్టగా, అనిల్‌ రావిపూడి కెమెరా స్విచ్చాన్‌ చేశారు...

ఫన్‌ ఫిల్డ్‌ అడ్వెంచర్‌

వరుస బ్లాక్‌బస్టర్స్‌తో దూసుకుపోతున్నారు హీరో శ్రీవిష్లు. ఉగాది సందర్భంగా మంగళవారం ఆయన తన 19వ చిత్రాన్ని ప్రారంభించారు. దిల్‌రాజు క్లాప్‌ కొట్టగా, అనిల్‌ రావిపూడి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. తొలి షాట్‌కి వీవీ వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఫన్‌ ఫిల్డ్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి జానకిరామ్‌ మారెళ్ల దర్శత్వం వహిస్తున్నారు. అనూష ద్రోణవల్లి, సీతాకుమారి కొత, గోపాలం లక్ష్మీదీపక్‌ నిర్మిస్తున్నారు. కోన వెంకట్‌, బాబీ కొల్లి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: చోటా కె ప్రసాద్‌, సంగీతం: విజయ్‌ బులగానిన్‌, డీఓపి: సాయి శ్రీరామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌:వై నాగు.

Updated Date - Apr 10 , 2024 | 01:49 AM