వినోదాత్మకంగా పేకమేడలు

ABN , Publish Date - Jul 10 , 2024 | 01:19 AM

‘నా పేరు శివ’, ‘అంధగారం’ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వినోద్‌కిషన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘పేకమేడలు’. అనూష కృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో..

‘నా పేరు శివ’, ‘అంధగారం’ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న వినోద్‌కిషన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘పేకమేడలు’. అనూష కృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో ‘ఎవరికీ చెప్పొద్దు’ సినిమా ఫేమ్‌ రాకేశ్‌ వర్రే సినిమాను నిర్మిస్తున్నారు. టీజర్‌, పాటలు లాంచ్‌ చేసి.. ఇప్పటికే పలు రకాల విభిన్న ప్రమోషన్‌ కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంది చిత్రబృందం. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నీలగిరి మామిళ్ల మాట్లాడుతూ ‘‘సామాన్యుల జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను రాసుకున్నాను. వినోదంతో పాటు భావోద్వేగాలను మిళితం చేసిన సినిమా ఇది’’ అని అన్నారు. చిత్ర నిర్మాత రాకేశ్‌ వర్రే మాట్లాడుతూ ‘‘ఇది కేవలం ఒక వినోదాత్మక చిత్రమే కాదు..


ఒక భార్య తన భర్తకు అన్ని వేళలా ఎంతగా సపోర్ట్‌ చేస్తుందో చూపించే చిత్రం’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని హీరో వినోద్‌కిషన్‌ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: సృజన అడుసుమిల్లి, హంజా అలీ, డీఓపీ: హరిచరణ్‌.కె, సంగీతం: స్మరణ్‌సాయి.

Updated Date - Jul 10 , 2024 | 01:19 AM