స్నేహ గీతం

ABN , Publish Date - Feb 14 , 2024 | 06:05 AM

ఇంద్ర, కోమల్‌ నాయర్‌, దీపు, స్వాతి శర్మ ప్రధాన తారాగణంగా స్నేహం గొప్పతనాన్ని తెలిపే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ట్రెండ్‌ మారినా ఫ్రెండ్‌ మారడు’. లక్ష్మణ్‌ జెల్ల దర్శకత్వంలో...

స్నేహ గీతం

ఇంద్ర, కోమల్‌ నాయర్‌, దీపు, స్వాతి శర్మ ప్రధాన తారాగణంగా స్నేహం గొప్పతనాన్ని తెలిపే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ట్రెండ్‌ మారినా ఫ్రెండ్‌ మారడు’. లక్ష్మణ్‌ జెల్ల దర్శకత్వంలో చంద్ర ఎస్‌ చంద్ర, డాక్టర్‌ విజయ రమేశ్‌ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం నుంచి ‘నా కల’ అంటూ సాగే గీతాన్ని సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘చిత్రీకరణ దాదాపు పూర్తయింది. కొత్త, పాత నటుల కాంబినేషన్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం’ అన్నారు. గాయని సునీత ఆలపించిన ఈ గీతం ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు అన్నారు. ఇందులో తన పాత్ర సరికొత్తగా ఉండబోతోందని ఇంద్ర చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్‌ భరద్వాజ. సినిమాటోగ్రఫీ: రాహుల్‌ మాచినేని

Updated Date - Feb 14 , 2024 | 06:05 AM