మనసు నొచ్చుకుంటే మన్నించండీ

ABN , Publish Date - Mar 01 , 2024 | 06:33 AM

వరుణ్‌తేజ్‌ హీరోగా నటించిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నాగేంద్రబాబు మాట్లాడుతూ ‘ఆరడుగుల మూడంగుళాలు ఉండే హీరోలు పోలీసు పాత్రలు చేస్తే బావుంటుంది..

మనసు నొచ్చుకుంటే మన్నించండీ

వరుణ్‌తేజ్‌ హీరోగా నటించిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నాగేంద్రబాబు మాట్లాడుతూ ‘ఆరడుగుల మూడంగుళాలు ఉండే హీరోలు పోలీసు పాత్రలు చేస్తే బావుంటుంది. ఐద డుగుల మూడంగుళాలు ఉండే హీరోలయితే చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంద’ని వ్యాఖ్యానించారు. దీనిపై పలువురు టాలీవుడ్‌ హీరోల అభిమానులు సోషల్‌ మీడియాలో నాగబాబు తీరును తప్పుపట్టారు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా నాగేంద్రబాబు స్పందించారు. ‘ఎవరినో తక్కువ చేయాలని అలా మాట్లాడలేదు, నా మాటల వల్ల ఎవరి మనసునైనా నొప్పించి ఉంటే క్షమించండి’ అని కోరారు.

Updated Date - Mar 01 , 2024 | 06:33 AM