ఆ ఇద్దరి కోసం
ABN , Publish Date - Oct 17 , 2024 | 05:38 AM
యాక్షన్ కింగ్ అర్జున్, జె.డి చక్రవర్తి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఇద్దరు’. ఎస్.ఎస్ సమీర్ దర్శకత్వంలో మహమ్మద్ ఫర్హీన్ ఫాతిమా నిర్మించారు. ఈ నెల 18న విడుదలవుతున్న సందర్భంగా...
యాక్షన్ కింగ్ అర్జున్, జె.డి చక్రవర్తి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఇద్దరు’. ఎస్.ఎస్ సమీర్ దర్శకత్వంలో మహమ్మద్ ఫర్హీన్ ఫాతిమా నిర్మించారు. ఈ నెల 18న విడుదలవుతున్న సందర్భంగా బుధవారం చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘మంచి లొకేషన్లలో గ్రాండ్‌గా చిత్రీకరణ చేశాం. అర్జున్, చక్రవర్తి ఇద్దరూ పోటీపడి నటించారు. కళా తపస్వి కే. విశ్వనాథ్‌గారు నటించిన చివరి సినిమా ఇదే. ఆయన ఎంతో ఇష్టపడి చేసిన చిత్రమిది. ఓ పాటలో ఆయన స్టెప్స్ కూడా వేశారు’ అని తెలిపారు. హీరోలు ఇద్దరూ కలసి చేసిన యాక్షన్ హంగామా ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాతలు చెప్పారు.