చారిత్రక యోధుడి పాత్రలో తొలిసారి!
ABN , Publish Date - Sep 24 , 2024 | 02:47 AM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చారు. ఆయన తొలిసారిగా చారిత్రక యోధుడి పాత్ర పోషిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా తాజా షెడ్యూల్ సోమవారం...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చారు. ఆయన తొలిసారిగా చారిత్రక యోధుడి పాత్ర పోషిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా తాజా షెడ్యూల్ సోమవారం ఉదయం విజయవాడలో మొదలైంది. కళా దర్శకుడు తోట తరణి రూపొందించిన భారీ సెట్‌లో యుద్ధ సన్నివేశాన్ని దర్శకుడు జ్యోతికృష్ణ చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ సారథ్యంలో జరుగుతున్న ఈ చిత్రీకరణలో నాజర్, రఘుబాబు, అయ్యప్ప పి.శర్మ, సునీల్ తదితరులతో పాటు ఫైటర్లు, జానియర్ ఆర్టిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. నిధి అగర్వాల్ చిత్ర కథానాయిక కాగా, బాలీవుడ్ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.వచ్చే ఏడాది మార్చి 28న ‘హరిహర వీరమల్లు’ పార్ట్ వన్ విడుదలవుతుందని వెల్లడిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.
పవన్‌కల్యాణ్‌ను సరికొత్తగా చూడబోతున్నామని ఈ పోస్టర్‌తో హామీ ఇచ్చారు దర్శకనిర్మాతలు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలయ్యే ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకరరావు చెప్పారు,