తెలుగులో తొలిసారి!

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:16 AM

తెలుగులో సెటైరికల్‌ ఫిల్మ్స్‌ కొన్ని వచ్చాయి కానీ పొలిటికల్‌ సెటైరికల్‌ ఫిల్మ్స్‌ తక్కువ అనే చెప్పాలి. అందుకే ఈ తరహా కాన్సెప్ట్‌ ఎన్నుకొని ప్రేక్షకులను నవ్వించడానికి ‘లక్ష్మీ కటాక్షం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు...

తెలుగులో తొలిసారి!

తెలుగులో సెటైరికల్‌ ఫిల్మ్స్‌ కొన్ని వచ్చాయి కానీ పొలిటికల్‌ సెటైరికల్‌ ఫిల్మ్స్‌ తక్కువ అనే చెప్పాలి. అందుకే ఈ తరహా కాన్సెప్ట్‌ ఎన్నుకొని ప్రేక్షకులను నవ్వించడానికి ‘లక్ష్మీ కటాక్షం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి డైలాగ్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఒక ఓటుకి ఇంత అని డబ్బు నిర్ణయిస్తుంటారు. కానీ ఈ డైలాగ్‌ పోస్టర్‌లో ఓటరే తన రేటుని నిర్ణయుంచడం విశేషం. ఇటువంటి కాన్సెప్ట్‌ తెలుగులో రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రతిబింబించేలా ఈ పోస్టర్‌ ఉంది. సూర్య దర్శకత్వంలో యు. శ్రీనివాసుల రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సాయికుమార్‌ ముఖ్య పాత్ర పోషించారు. వినయ్‌, అరుణ్‌, దీప్తి వర్మ ఇతర ముఖ్య తారాగణం. తాడిపత్రి నేపథ్యంగా చిత్ర కథ ఉంటుందనీ, త్వరలో సరదాగా ఉండే టీజర్‌, ట్రైలర్‌ను విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అభిషేక్‌ రువూస్‌, ఛాయాగ్రహణం: నాని ఐనవల్లి, నిర్మాతలు: యు.శ్రీనివాసుల రెడ్డి, బి.నాగేశ్వర రెడ్డి, వహీద్‌ షేక్‌, కె. పురుషోత్తం రెడ్డి.

Updated Date - Apr 16 , 2024 | 03:16 AM