శివయ్య ఆశీస్సుల కోసం...
ABN , Publish Date - Oct 26 , 2024 | 05:59 AM
‘కన్నప్ప’ టీమ్ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించింది. పన్నెండు జ్యోతిర్లింగాల సందర్శనలో భాగంగా.. డాక్టర్. మోహన్‌బాబు, నటుడు విష్ణు మంచు, దర్శకుడు ముఖేశ్‌కుమార్ తదితరులు.. కేధార్‌నాథ్, బద్రీనాథ్,
‘కన్నప్ప’ టీమ్ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించింది. పన్నెండు జ్యోతిర్లింగాల సందర్శనలో భాగంగా.. డాక్టర్. మోహన్‌బాబు, నటుడు విష్ణు మంచు, దర్శకుడు ముఖేశ్‌కుమార్ తదితరులు.. కేధార్‌నాథ్, బద్రీనాథ్, రిషికేశ్‌క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ ‘‘శివుని ఆశీస్సుల కోసం ఈ యాత్రను ప్రారంభించాం. ఈ సినిమాను అందరూ మెచ్చే విధంగా తెరకెక్కించడానికి అహర్నిశలు శ్రమిస్తున్నాం’’ అని చెప్పారు. కాగా, విష్ణు మంచు నటిస్తున్న ఈ సినిమాను ముఖేశ్ కుమార్ దర్శకత్వంలో మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. డిసెంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.