హ్యాట్రిక్‌ హిట్‌ కోసం..

ABN , Publish Date - Apr 10 , 2024 | 01:51 AM

విక్టరీ వెంకటేశ్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ చిత్రాలు ఘన విజయం సాధించాయి. హ్యాట్రిక్‌ హిట్‌ కోసం వీరిద్దరూ మళ్లీ జత కట్టారు. దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించే...

హ్యాట్రిక్‌ హిట్‌ కోసం..

విక్టరీ వెంకటేశ్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ చిత్రాలు ఘన విజయం సాధించాయి. హ్యాట్రిక్‌ హిట్‌ కోసం వీరిద్దరూ మళ్లీ జత కట్టారు. దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించే ఈ సినిమా వివరాలను ఉగాది సందర్భంగా మంగళవారం వెల్లడించారు. బ్యాక్‌ టు బ్యాక్‌ ఏడు హిట్స్‌ అందించిన అనిల్‌ రావిపూడికి దిల్‌ రాజు నిర్మాణ సంస్థలో ఇది ఆరో సినిమా కావడం గమనార్హం.

హీరో, అతని మాజీ ప్రేయసి, భార్య.. ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ట్రయాంగిల్‌ క్రైమ్‌ లవ్‌ స్టోరీ ఇదని దర్శకనిర్మాతలు చెప్పారు. హై బడ్జెట్‌తో రూపుదిద్దుకొనే ఈ చిత్రం వినోదభరితంగా ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాది సంకాంత్రికి చిత్రాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.

Updated Date - Apr 10 , 2024 | 01:51 AM