జానపద, సినీగాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్‌ కన్నుమూత

ABN , Publish Date - Mar 01 , 2024 | 06:26 AM

ప్రముఖ జానపద, సినీ గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్‌(64) గురువారం ఉదయం సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండి శ్రీనివా్‌సనగర్‌లోని తన స్వగృహంలో మృతిచెందారు...

జానపద, సినీగాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్‌ కన్నుమూత

ప్రముఖ జానపద, సినీ గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్‌(64) గురువారం ఉదయం సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండి శ్రీనివా్‌సనగర్‌లోని తన స్వగృహంలో మృతిచెందారు. ఆయనకు భార్య ఇందిర, కుమార్తె మానస ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు 14వేల ప్రదర్శనలను ఇచ్చిన శ్రీనివాస్‌ తొలిసారిగా ‘నమస్తే అన్న’ చిత్రంలో ‘గరం... గరం... పోరీ... నా గజ్జెల సవారీ’ పాట పాడారు. ఆ తర్వాత నాగార్జున ‘కింగ్‌’ సినిమాలో ‘గింత, గింత బాల చుక్కవే’ పాట పాడారు. పవన్‌కల్యాణ్‌ నటించిన ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రంలో శ్రీనివాస్‌ పాడిన ‘గన్నులాంటి కన్నులున్న...’ పాట ఎంతో హిట్‌ అయ్యింది. ఈ పాటకు 2012 సంవత్సరంలో ఉత్తమగాయకుడిగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు అందుకున్నారు. గురువారం సాయంత్రం వడ్డేపల్లి శ్రీనివాస్‌ అంత్యక్రియలు సీతాఫల్‌మండి శశ్మానవాటికలో జరిగాయి.

బౌద్ధనగర్‌ (ఆంధ్రజ్యోతి)

Updated Date - Mar 01 , 2024 | 06:27 AM