పిడికిలి బిగించి..

ABN , Publish Date - May 29 , 2024 | 06:39 AM

నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తున్న 21వ చిత్రం గ్లింప్స్‌ను ‘ది ఫిస్ట్‌ ఆఫ్‌ ఫ్రేమ్‌’ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థలు అశోక్‌ క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ విడుదల చేశాయి....

పిడికిలి బిగించి..

నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తున్న 21వ చిత్రం గ్లింప్స్‌ను ‘ది ఫిస్ట్‌ ఆఫ్‌ ఫ్రేమ్‌’ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థలు అశోక్‌ క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ విడుదల చేశాయి. ఈ వీడియోలో కల్యాణ్‌రామ్‌ పిడికిలి బిగించి చూపి తన పాత్ర ఎంత పవర్‌పుల్‌గా ఉంటుందో తెలియజేశారు. ‘సరి లేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత సీనియర్‌ నటి విజయశాంతి మళ్లీ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదొక డైనమిక్‌ పాత్ర అని దర్శకుడు చెప్పారు. సోహెల్‌ ఖాన్‌, సాయి మంజ్రేకర్‌, శ్రీకాంత్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌, సినిమాటోగ్రఫీ: రామ్‌ప్రసాద్‌, ఎడిటింగ్‌: తమ్మిరాజు, స్ర్కీన్‌ప్లే: శ్రీకాంత్‌ విస్సా, నిర్మాతలు: అశోక్‌ వర్థన్‌ ముప్పా, సునీల్‌ బలుసు. సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి.

Updated Date - May 29 , 2024 | 06:39 AM