మాస్ పాత్రలో తొలిసారి
ABN , Publish Date - Oct 06 , 2024 | 02:50 AM
వెంకట్ హీరోగా నటించిన ‘హరుడు’ చిత్రం గ్లింప్స్ శనివారం విడుదల చేశారు. రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో డాక్టర్ ప్రవీణ్‌రెడ్డి నిర్మించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ...
వెంకట్ హీరోగా నటించిన ‘హరుడు’ చిత్రం గ్లింప్స్ శనివారం విడుదల చేశారు. రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో డాక్టర్ ప్రవీణ్‌రెడ్డి నిర్మించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం దర్శకుడు రాత్రింబవళ్లు కృషి చేశారు. సినిమాలోని పాటలు ఆదరణ పొందుతాయి’ అన్నారు. కథ విన్న ఐదు నిముషాల్లో ఒకే చేసిన నిర్మాతకు దర్శకుడు కృతజ్ఞతలు తెలిపారు. వెంకట్ ఐదేళ్ల జర్నీ ఉందనీ, ఆయన ఇందులో మాస్ హీరోగా నటించారని చెప్పారు. హీరో వెంకట్ మాట్లాడుతూ ‘కమర్షియల్ ఎలిమెంట్స్ కలిగిన మాస్ చిత్రం ఇది. షూటింగ్‌తో పాటు 60 శాతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఇందులో తొలిసారిగా మాస్ పాత్ర చేశాను. నా పాత్రకు దీటుగా హెబ్బా పటేల్ పాత్ర ఉంటుంది. నటాషాసింగ్ మరో పాత్ర చేసింది. సలోని స్పెషల్ సాంగ్ చేసింది’ అని చెప్పారు.