మొదట ఎన్టీఆర్‌.. ఇప్పుడు రామ్‌చరణ్‌

ABN , Publish Date - Mar 07 , 2024 | 01:39 AM

అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ నటించే రెండో తెలుగు చిత్రం కూడా కన్‌ఫర్మ్‌ అయింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన ‘దేవర’ చిత్రంలో నటిస్తున్న ఆమె తాజాగా రామ్‌చరణ్‌ హీరోగా నటించే 16 సినిమాలో...

మొదట ఎన్టీఆర్‌..  ఇప్పుడు రామ్‌చరణ్‌

అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ నటించే రెండో తెలుగు చిత్రం కూడా కన్‌ఫర్మ్‌ అయింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన ‘దేవర’ చిత్రంలో నటిస్తున్న ఆమె తాజాగా రామ్‌చరణ్‌ హీరోగా నటించే 16 సినిమాలో కథానాయికగా నటించనున్నారు. జాన్వీ ఈ చిత్రం చేస్తుందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఆమె తండ్రి బోనీ కపూర్‌ ఇటీవల ఈ విషయం వెల్లడించారు కూడా. జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం వద్ది సినిమాస్‌ అధినేతలు అధికారికంగా ఈ విషయం వెల్లడించారు. దర్శకుడు బుచ్చిబాబు సాన ఈ సినిమా కోసం యూనివర్సల్‌ అప్పీల్‌ ఉండే పవర్‌ఫుల్‌ స్ర్కిప్ట్‌ సిద్ధం చేశారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాత వెంకట సతీశ్‌ కిలారు చెప్పారు.

Updated Date - Mar 07 , 2024 | 01:39 AM