ధూమ్‌ధామ్‌గా ఫస్ట్‌ లుక్‌

ABN , Publish Date - Mar 07 , 2024 | 01:35 AM

చేతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఽధూమ్‌ధామ్‌’. సాయికుమార్‌, వెన్నెల కిశోర్‌, పృథ్వీరాజ్‌, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు...

ధూమ్‌ధామ్‌గా ఫస్ట్‌ లుక్‌

చేతన్‌ కృష్ణ, హెబ్బా పటేల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఽధూమ్‌ధామ్‌’. సాయికుమార్‌, వెన్నెల కిశోర్‌, పృథ్వీరాజ్‌, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి కుమార్‌ మచ్చ దర్శకత్వం వహించగా, గోపీ మోహన్‌ స్ర్కీన్‌ ప్లే అందిస్తున్నారు. ఎంఎస్‌ రామ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు.

Updated Date - Mar 07 , 2024 | 01:35 AM