సల్మాన్‌ ఖాన్‌ ఇంటి బయట కాల్పులు

ABN , Publish Date - Apr 15 , 2024 | 12:59 AM

బాలీవుడ్‌ అగ్ర నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి బయట ఆదివారం ఉదయం కొందరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఆరు రౌండ్ల కాల్పులకు పాల్పడగా అందులో ఓ బుల్లెట్‌...

సల్మాన్‌ ఖాన్‌ ఇంటి  బయట కాల్పులు

బాలీవుడ్‌ అగ్ర నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి బయట ఆదివారం ఉదయం కొందరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఆరు రౌండ్ల కాల్పులకు పాల్పడగా అందులో ఓ బుల్లెట్‌ మొదటి అంతస్థులోకి దూసుకువచ్చింది. ఈ దాడి జరిగిన సమయంలో సల్మాన్‌ ఇంట్లోనే ఉన్నారు. ఈ సంఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ కాల్పులు తామే చేశామని గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ ఫేస్‌బుక్‌లో ప్రకటించారు. ‘‘సల్మాన్‌... ఇప్పుడు మేం చేసిన పని జస్ట్‌ ట్రైలర్‌. మేం ఎంతకు తెగిస్తామో నీకు అర్థమై ఉంటుంది. మా సహనాన్ని పరీక్షించొద్దు. ఈ సారి తుపాకీ పేలుడు ఇంటి బయట దాడితోనే ఆగిపోదు’’ అని హెచ్చరించారు.

Updated Date - Apr 15 , 2024 | 12:59 AM