మున్నార్‌లో ముగించారు

ABN , Publish Date - Feb 18 , 2024 | 03:03 AM

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాబిన్‌హుడ్‌’ చిత్రం మున్నార్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తాజా షెడ్యూల్‌లో చిత్రబృందం పాల్గొనగా కీలకఘట్టాలను తెరకెక్కించారు...

మున్నార్‌లో ముగించారు

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాబిన్‌హుడ్‌’ చిత్రం మున్నార్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తాజా షెడ్యూల్‌లో చిత్రబృందం పాల్గొనగా కీలకఘట్టాలను తెరకెక్కించారు. టాకీపార్ట్‌తో పాటు నితిన్‌, ఫైటర్స్‌పై భారీ యాక్షన్‌ బ్లాక్‌ను చిత్రీకరించారు. త్వరలోనే తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు యూనిట్‌ తెలిపింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్‌ సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, వెన్నెల కిషోర్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Feb 18 , 2024 | 03:03 AM