రికార్డులు కోసం సినిమాలు తీయం

ABN , Publish Date - Jun 29 , 2024 | 03:35 AM

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 200 కోట్ల వసూళ్లకు చేరువైంది...

రికార్డులు కోసం సినిమాలు తీయం

నిర్మాత స్వప్న దత్‌

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 200 కోట్ల వసూళ్లకు చేరువైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సృష్టించబోయే రికార్డులపై అందరి దృష్టి పడింది. ఏఏ రికార్డులు బద్దలవుతాయనే చర్చ అటు పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ‘కల్కి’ నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. ‘మా సినిమా అధిగమించిన రికార్డుల గురించి చాలా మంది అడుగుతున్నారు. ఇది హాస్యాస్పదం. రికార్డులు సృష్టించేవారు ఎప్పుడూ రికార్డుల కోసమే సినిమాలు తీయరు. సినిమా, ప్రేక్షకుల పైన ప్రేమతోనే మేం సినిమాలు తీస్తాం. ‘కల్కి’ చిత్రాన్ని కూడా ఇదే విధంగా రూపొందించాం’ అన్నారు.

Updated Date - Jun 29 , 2024 | 03:35 AM