Pushpa-2 : పతాక సన్నివేశాల చిత్రీకరణ

ABN , Publish Date - Aug 06 , 2024 | 05:00 AM

అల్లు అర్జున్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’. డైరెక్టర్‌ సుకుమార్‌, నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ ఈ సీక్వెల్‌ను ‘పుష్ప పార్ట్‌ 1’ను మించి ఉండేలా ప్రతీ విషయంలో...

అల్లు అర్జున్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’. డైరెక్టర్‌ సుకుమార్‌, నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ ఈ సీక్వెల్‌ను ‘పుష్ప పార్ట్‌ 1’ను మించి ఉండేలా ప్రతీ విషయంలో జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, రెండు పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. చిత్రీకరణను దాదాపు పూర్తి చేసుకుందీ చిత్రం. ప్రస్తుతం, ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్‌ షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ఓ భారీ సెట్‌లో జరుగుతోంది. ఈ సెట్‌లో అల్లు అర్జున్‌తో పాటు ఇతర కీలక తారాగణం పాల్గొంది. ఈ క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ థియేటర్స్‌లో గూస్‌బంప్స్‌ తెప్పిస్తుందని మేకర్స్‌ తెలిపారు. డిసెంబరు 6న సినిమా విడుదల కానుంది.

Updated Date - Aug 06 , 2024 | 05:00 AM