చిత్ర పరిశ్రమ నేపథ్యంలో సినిమా

ABN , Publish Date - Jun 18 , 2024 | 03:36 AM

అభిరామ్‌, వెన్నెల, మనోహర్‌, పవన్‌, కృష్ణ, మంజుల హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇట్లు.. మీ సినిమా’ ఈ నెల 21న విడుదల కానుంది. నలుగురు యువకులు సినిమా మీదున్న ఫ్యాషన్‌తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎటువంటి...

చిత్ర పరిశ్రమ నేపథ్యంలో సినిమా

అభిరామ్‌, వెన్నెల, మనోహర్‌, పవన్‌, కృష్ణ, మంజుల హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇట్లు.. మీ సినిమా’ ఈ నెల 21న విడుదల కానుంది. నలుగురు యువకులు సినిమా మీదున్న ఫ్యాషన్‌తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎటువంటి సవాళ్లు ఎదుర్కొన్నారు.. అనే కథాంశంతో రూపుదిద్దుకున్న చిత్రమిది. లవ్‌, రొమాన్స్‌, కామెడీ, సెంటిమెంట్‌ అంశాలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి హరీశ్‌ చావా దర్శకుడు. నోరి నాగప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన సందర్భంగా ప్రసాద్‌ ప్రీవ్యూ థియేటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు హరీశ్‌ చావా మాట్లాడుతూ ‘సినిమా కథ కోసం అన్వేషిస్తున్నప్పుడు ఏ కథో ఎందుకు.. సినిమా ఇండస్ట్రీలో పడే ఇబ్బందుల గురించి సినిమా తీద్దాం. అన్నారు మా నిర్మాత. పరిశ్రమలోకి అడుగుపెట్టే వారికి అవగాహన కల్పించే విధంగా మా సినిమా ఉంటుంది. ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది’ అని చెప్పారు. ‘పరిశ్రమలోకి వచ్చే కొత్త వాళ్లు పడే ఇబ్బందుల్ని ఆసక్తికరంగా, ప్రేక్షకులకు నచ్చే రీతిలో చూపించాం. ఈ నెల 21న విడుదల చేస్తున్నాం. చిన్న సినిమా కనుక దయచేసి అందరూ థియేటర్లకు వెళ్లి చూడండి’ అని కోరారు నిర్మాత నాగప్రసాద్‌. ఈ కార్యక్రమంలో హీరో అభిరామ్‌, హీరోయిన్‌ వెన్నెల, తెలుగు నిర్మాతలమండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2024 | 03:36 AM