క్యూలో నిల్చుని ఓటేసిన సినీ ప్రముఖులు
ABN , Publish Date - May 14 , 2024 | 12:24 AM
సోమవారం హైదరాబాద్‌లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సాధారణ జనంతో పాటు ఉదయం ఏడు గంటలకే పోలింగ్ బూత్‌కు వెళ్లి...

సోమవారం హైదరాబాద్‌లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సాధారణ జనంతో పాటు ఉదయం ఏడు గంటలకే పోలింగ్ బూత్‌కు వెళ్లి క్యూ లైన్లలో నిలబడి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్, కల్యాణ్‌రామ్, డాక్టర్ రాజశేఖర్, నాని, నాగచైతన్య, విజయ్ దేవరకొండ.. ఒకరనేమిటి అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ‘మీరు కూడా ఓటు వేయండ’ంటూ పిలుపునిచ్చారు.