ప్రజా సమస్యలపై పోరాటం
ABN , Publish Date - Oct 23 , 2024 | 02:09 AM
రాకేశ్ వర్రే టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. ముదుగంటి క్రియేషన్స్‌పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఉయ్యాలా జంపాల’, ‘మజ్నూ’ సినిమాలు తీసిన...
రాకేశ్ వర్రే టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. ముదుగంటి క్రియేషన్స్‌పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఉయ్యాలా జంపాల’, ‘మజ్నూ’ సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ నక్సలైట్లతో జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించినట్లు చిత్రబృందం తెలిపింది. వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాశ్ ముఖ్య పాత్రలు పోషించారు.