బంగారం వేటలో పోరాటం

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:36 AM

తమిళ హీరో విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘తంగలాన్‌’. పా రంజిత్‌ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు...

తమిళ హీరో విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘తంగలాన్‌’. పా రంజిత్‌ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు.

కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్‌ బుధవారం విడుదల చేశారు. రెండు గిరిజన తెగల మధ్య పోరాటం, తనవాళ్లను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించే నాయకుడి పాత్రలో విక్రమ్‌ నటన, ఆయన సిద్ధమైన తీరు, యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో పార్వతీ తిరువోతు, మాళవికా మోహనన్‌ కథానాయికలు. పశుపతి, హరికృష్ణన్‌ కీలకపాత్రలు పోషించారు. సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్‌, ఎడిటర్‌ : ఆర్‌ కే సెల్వ

Updated Date - Jul 11 , 2024 | 04:36 AM