జాలీ రైడ్‌కు వెళ్లిన అనుభూతి కలుగుతుంది

ABN , Publish Date - Jan 25 , 2024 | 04:42 AM

శివ కార్తికేయన్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా రూపొందిన ‘అయలాన్‌’ చిత్రం ఈ నెల 12న సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో విడుదలై విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 26న గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ద్వారా...

జాలీ రైడ్‌కు వెళ్లిన అనుభూతి కలుగుతుంది

శివ కార్తికేయన్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా రూపొందిన ‘అయలాన్‌’ చిత్రం ఈ నెల 12న సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో విడుదలై విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 26న గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ద్వారా మహేశ్వర్‌ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో బుధవారం కార్తికేయన్‌ ముచ్చటించారు

  • దర్శకుడు రవికుమార్‌ విజన్‌ ‘అయలాన్‌’. సినిమాలో 4500 వి.ఎఫ్‌.ఎక్స్‌ షాట్స్‌ ఉన్నాయి. పరిమిత నిర్మాణ వ్యయంతో సినిమా తీయగలిగితే మరింత పెద్ద కలలు కనవచ్చు.. అనిపించింది. అందుకే ఎక్కువ రోజులు పట్టినా ఈ సినిమానే చేయాలని నిర్ణయించుకున్నా.

  • యూనివర్సల్‌ కాన్సెప్ట్‌ ఉన్న చిత్రమిది. హ్యూమన్‌, ఏలియన్‌ మధ్య ఇంటరాక్షన్‌ అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుంది. ఇది సినిమాలా ఉండదు. థీమ్‌ పార్క్‌లోకి వెళ్లి జాలీ రైడ్‌ చేసిన అనుభూతి కలిగిస్తుంది. మా సినిమా తమిళనాడులో భారీ విజయం సాధించింది. తెలుగులో కూడా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది.

  • రూ. 200, 300 కోట్ల బడ్జెట్‌ ఉంటే తప్ప ఇటువంటి సినిమా చేయలేమని చెబుతారు. అయితే సరైన టీమ్‌, ప్లానింగ్‌ ఉంటే తక్కువ బడ్జెట్‌లో కూడా తీయవచ్చు. ఇది హిట్‌ అయితే ఎక్కువ బడ్జెట్‌ ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వస్తారు. మమ్మల్ని మోటివేట్‌ చేసిన అంశం ఇదే.

  • ఫ అయలాన్‌లో 90 శాతం సన్నివేశాల్లో గ్రాఫిక్స్‌ ఉన్నాయి. 70 శాతం సినిమాలో ఏలియన్‌ ఉంది. సో మెజారిటీ సినిమా అంతా విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి.

  • ఈ సినిమాకు సీక్వెల్‌ ఐడియా ఉంది. ఏలియన్‌ను క్రియేట్‌ చేయడానికి మేం చాలా రిసెర్చ్‌ చేశాం. ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేశాం. సీక్వెల్‌ను ఇంతకంటే బిగ్గర్‌ స్కేల్‌లో చేస్తాం.

  • కమల్‌హాసన్‌ గారి చిత్రం 80 శాతం పూర్తయింది. ఇందులో నేను, సాయిపల్లవి కలసి నటిస్తున్నాం. ఏ తరహా చిత్రం అనేది ఇప్పుడు చెప్పను. వేసవిలో విడుదల కావచ్చు.

Updated Date - Jan 25 , 2024 | 04:42 AM