ఫీల్‌గుడ్‌ ఎంటర్టైనర్‌

ABN, Publish Date - Jul 21 , 2024 | 01:39 AM

సదన్‌ హీరోగా పరిచయమౌతున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. ప్రియాంక ప్రసాద్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సాయి కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. పి.ఎల్‌.విఘ్నేశ్‌ దర్శకత్వంలో పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు...

సదన్‌ హీరోగా పరిచయమౌతున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. ప్రియాంక ప్రసాద్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సాయి కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. పి.ఎల్‌.విఘ్నేశ్‌ దర్శకత్వంలో పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘గ్లింప్స్‌ చక్కగా ఉంది. చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని చెప్పారు. ‘‘ఫీల్‌గుడ్‌ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది’’ అని నిర్మాత పారమళ్ల లింగయ్య అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: కొడగంటి వీక్షితవేణు, కెమెరా: ఈదర ప్రసాద్‌, సంగీతం: మార్కండేయ.

Updated Date - Jul 21 , 2024 | 01:39 AM