Devara : సూపర్‌ ఎలివేషన్స్‌తో ‘ఫియర్‌’

ABN , Publish Date - May 20 , 2024 | 05:10 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా...

Devara : సూపర్‌ ఎలివేషన్స్‌తో ‘ఫియర్‌’

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, సుధాకర్‌ మిక్కిలినేని, కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్‌ ఇందులో కథానాయికగా నటిస్తుండగా, సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ‘దేవర పార్ట్‌ 1’ అక్టోబర్‌ 10న విడుదలవుతోంది. సోమవారం తారక్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేసింది. ‘ఫియర్‌’ పేరుతో రిలీజైన ఈ రాప్‌ సాంగ్‌ ఎన్టీఆర్‌ పాత్రకు సూపర్‌ ఎలివేషన్స్‌ ఇచ్చింది. అద్భుతమైన విజువల్స్‌, పవర్‌ఫుల్‌ లిరిక్స్‌తో సాగిన ఈ సాంగ్‌ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. రామజోగయ్యశాస్త్రి ఈ పాటను రచించగా, అనిరుధ్‌ రవిచందర్‌ పాటకు మ్యూజిక్‌ అందించి, ఆలపించారు.

Updated Date - May 20 , 2024 | 05:10 AM