Ram Charan: షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు చాలా మిస్‌ అవుతున్నా!

ABN , Publish Date - Jun 16 , 2024 | 04:26 PM

తన గారాలపట్టి క్లీంకారకు గోరుముద్దలు తినిపించడంలో తనను మించినవారు లేరని గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అన్నారు. తన ముద్దుల కూతురికి అన్నం పెట్టేటప్పుడు తనలోకి సూపర్‌పవర్స్‌ ఆవహిస్తాయని వెల్లడించారు.

Ram Charan: షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు చాలా మిస్‌ అవుతున్నా!

తన గారాలపట్టి క్లీంకారకు (klinkara)గోరుముద్దలు తినిపించడంలో తనను మించినవారు లేరని గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) అన్నారు. తన ముద్దుల కూతురికి అన్నం పెట్టేటప్పుడు తనలోకి సూపర్‌పవర్స్‌ ఆవహిస్తాయని వెల్లడించారు. ఫాదర్స్‌ డే సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విశేషాలను చెప్పుకొచ్చారు. ‘‘క్లీంకారకు రోజుకు రెండు సార్లైనా నేను తినిపిస్తుంటా. అలా చేయడం నాకు చాలా ఇష్టం. నేను గోరుముద్దలు పెడితే.. గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. ఆ విషయంలో నన్నెవరూ బీట్‌ చేయలేరు. ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులను గుర్తిస్తోంది. షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు తనను ఎంతగానో మిస్‌ అవుతుంటాను. తను స్కూల్‌లో జాయిన్‌ అయ్యే వరకూ అయినా తనతో సమయం గడిపేలా తదుపరి చిత్రాల షెడ్యూల్స్‌ను ప్లాన్‌ చేసుకుంటాను’’ అని అన్నారు. క్లీంకారతో ఉంటే తన తండ్రి చిరంజీవి పిల్లాడిగా మారిపోతారన్నారు. ‘నన్ను తాత అని పిలవకు బోరింగ్‌గా ఉంటుంది. చిరుత అని పిలువు’ అంటూ మురిసిపోతారని చరణ్‌ అన్నారు.  (Upasana konidela)

am-charan.jpg

చిరంజీవి (Chiranjeevi) గురించి చరణ్‌ పలు విషయాలు చెప్పుకొచ్చారు. ‘‘డెడికేషన్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, క్రమశిక్షణలో నాన్నే నాకు స్ఫూర్తి. ‘రామ్‌.. నువ్వెంత సక్సెస్‌ అయ్యావనేదాన్ని నేను పట్టించుకోను. కానీ, క్రమశిక్షణను అలవరుచుకో’ అని ఆయన చెబుతుంటారు. నాన్న లివింగ్‌ రోల్‌ మోడల్‌. ఆయనలా బతకడం చాలా కష్టం. ఉదయం 5 గంటలకు నిద్ర లేస్తారు. జిమ్‌లో మాతో పోటీపడతారు. ఆయన నాలుగు చిత్రాలకు సైన్ చేస్తే. నేను ఒకటో రెండో చేస్తున్నా’’ అని సరదాగా అన్నారు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా ఖరారు చేశారు. 

Updated Date - Jun 16 , 2024 | 04:27 PM