తాతామనవళ్లుగా తండ్రీ కొడుకులు

ABN , Publish Date - May 09 , 2024 | 06:28 AM

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్‌ కలసి ఓ సినిమా చేయనున్నారు. ఇందులో వీళ్లిధ్దరూ తాతా మనవళ్లుగా నటిస్తుండడం విశేషం. కొత్త దర్శకుడు ఆర్వీఎస్‌ నిఖిల్‌...

తాతామనవళ్లుగా తండ్రీ కొడుకులు

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్‌ కలసి ఓ సినిమా చేయనున్నారు. ఇందులో వీళ్లిధ్దరూ తాతా మనవళ్లుగా నటిస్తుండడం విశేషం. కొత్త దర్శకుడు ఆర్వీఎస్‌ నిఖిల్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం పేరు ‘బ్రహ్మ ఆనందం’. రాహుల్‌ యాదవ్‌ నక్కా ఈ సినిమాకు నిర్మాత. గౌతమ్‌ తదుపరి చిత్రం గురించి బ్రహ్మనందం, వెన్నెల కిశోర్‌ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణతో ఓ వీడియో విడుదల చేశారు. కొత్త సినిమాలో నటించడానికి గౌతమ్‌ అంగీకరించాడనీ వెన్నెల కిశోర్‌ చెప్పగానే, అందులో తాత పాత్ర పోషించమని కిశోర్‌, గౌతమ్‌ బ్రహ్మానందంను అభ్యర్ధించడం ఈ వీడియోలో ఉంది. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలకల్‌ హీరోయిన్లుగా నటించే ఈ వినోద భరిత చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభమవుతుందనీ, డిసెంబర్‌ 6న విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు.

Updated Date - May 09 , 2024 | 06:28 AM