శరవేగంగా.. లగ్గం!

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:04 AM

‘భీమదేవరపల్లి బ్రాంచి’ ఫేం రమేశ్‌ చెప్పాల దర్శకత్వంలో చిత్రీకరణ జరుపుకొంటోన్న చిత్రం ‘లగ్గం’. సాయి రోనక్‌, ప్రగ్యా నగ్రా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, రోహిణి, ఎల్‌ బి శ్రీరామ్‌, సప్తగిరి ముఖ్య పాత్రలు...

శరవేగంగా.. లగ్గం!

‘భీమదేవరపల్లి బ్రాంచి’ ఫేం రమేశ్‌ చెప్పాల దర్శకత్వంలో చిత్రీకరణ జరుపుకొంటోన్న చిత్రం ‘లగ్గం’. సాయి రోనక్‌, ప్రగ్యా నగ్రా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, రోహిణి, ఎల్‌ బి శ్రీరామ్‌, సప్తగిరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వేణుగోపాల్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. మంగళవారం, ఈ చిత్ర బృందం మీడియాతో ముచ్చటించింది. పెళ్లి కాన్సె్‌ప్టతో వచ్చిన సినిమాలన్నింటి కంటే ప్రత్యేకంగా ఈ చిత్రం ఉండబోతోందని నటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. తెలంగాణ పెళ్లిని కన్నుల విందుగా తెరకెక్కించామని, ప్రతీ ఒక్కరూ ఈ చిత్రం చూసి ఇందులోని సన్నివేశాల గురించి గొప్పగా మాట్లాడుకుంటారని ఈ చిత్ర దర్శకుడు రమేశ్‌ తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని..కొన్ని తరాలు గుర్తుంచుకునేలా ఉంటుందని నిర్మాత విశ్వాసం వ్యక్తం చేశారు. దర్శకుడు అన్ని హంగులు జోడించి లగ్గం యూనివర్స్‌ను క్రియేట్‌ చేశారని నటి రోహిణి పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు-చరణ్‌ అర్జున్‌, ఎడిటర్‌-బొంతల నాగేశ్వర రెడ్డి, కెమెరామెన్‌-బాలరెడ్డి.

Updated Date - Mar 06 , 2024 | 01:04 AM