బాలకృష్ట అభిమానిని

ABN , Publish Date - May 28 , 2024 | 03:37 AM

‘నేను బాలకృష్ణ అభిమానిని. ఆయనతో సినిమా తీసే అవకాశం వస్తే ఓ వరంలా భావిస్తా’ అన్నారు వంశీ కారుమంచి. కేదార్‌ సెలగంశెట్టితో కలసి ఆయన నిర్మించిన ‘గంగం గణేశా’ చిత్రం ఈ నెల 31న...

బాలకృష్ట అభిమానిని

‘నేను బాలకృష్ణ అభిమానిని. ఆయనతో సినిమా తీసే అవకాశం వస్తే ఓ వరంలా భావిస్తా’ అన్నారు వంశీ కారుమంచి. కేదార్‌ సెలగంశెట్టితో కలసి ఆయన నిర్మించిన ‘గంగం గణేశా’ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ‘గణేశుడి విగ్రహం, డబ్బుతో ముడిపడిన యాక్షన్‌ కామెడీ సినిమా ఇది. ఆనంద్‌ దేవరకొండ కథ విని కొత్తగా ఉందని ఫీల్‌ అయి నటించాడు. ఆయన ‘బేబి’ సినిమాతో పోల్చవద్దు. హీరోయిన్లు నయన్‌ సారిక, ప్రగతి శ్రీవాస్తవ పాత్రలకు ప్రాదాన్యం ఉంది’ అన్నారు. ఏ బిజినెస్‌ అయినా రిస్క్‌ చేయాల్సిందేనని చెబుతూ ‘లైఫ్‌లో రిస్క్‌ లేకపోతే ఏం సాధించలేం. సినిమా ప్రొడక్షన్‌ లోనూ అంతే’ అన్నారు.

Updated Date - May 28 , 2024 | 03:37 AM