ఫ్యామిలీస్టార్‌ ప్రేమగీతం

ABN , Publish Date - Feb 08 , 2024 | 05:27 AM

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీస్టార్‌’. ఆయనకు జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్నారు. పరశురామ్‌ పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌పై దిల్‌ రాజు...

ఫ్యామిలీస్టార్‌ ప్రేమగీతం

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీస్టార్‌’. ఆయనకు జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్నారు. పరశురామ్‌ పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం చిత్రబృందం ‘నందనందనా’ అంటూ సాగే ప్రేమగీతాన్ని విడుదల చేసి మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది. ఈ పాటకు అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించగా, గోపీ సుందర్‌ స్వరాలు సమకూర్చారు. సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్‌. ఎడిటర్‌: మార్తాండ్‌ కే వెంకటేశ్‌

Updated Date - Feb 08 , 2024 | 05:27 AM