అంచనాలకు మించేలా

ABN , Publish Date - Jul 15 , 2024 | 02:51 AM

అభిషేక్‌ పచ్చిపాల, నజియా ఖాన్‌, వినీశా జ్ఞానేశ్వర్‌ తెరకెక్కిన చిత్రం ‘జస్ట్‌ ఏ మినిట్‌’. యశ్వంత్‌ దర్శకత్వంలో తన్వీర్‌, ప్రకాశ్‌ నిర్మించారు. ఈ నెల 19న సినిమా విడుదలవుతోంది...

అభిషేక్‌ పచ్చిపాల, నజియా ఖాన్‌, వినీశా జ్ఞానేశ్వర్‌ తెరకెక్కిన చిత్రం ‘జస్ట్‌ ఏ మినిట్‌’. యశ్వంత్‌ దర్శకత్వంలో తన్వీర్‌, ప్రకాశ్‌ నిర్మించారు. ఈ నెల 19న సినిమా విడుదలవుతోంది. శనివారం మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత తన్వీర్‌ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులు సినిమా చూసి మంచి సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. హీరో అభిషేక్‌ పచ్చిపాల మాట్లాడుతూ ‘‘ఈ సినిమా మొత్తం చాలా వినోదాత్మకంగా ఉంటుంది’’ అని చెప్పారు. దర్శకుడు యశ్వంత్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా అందరి అంచనాలకు మించి ఉంటుంది’’ అని అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: దుర్గ నరసింహా, సినిమాటోగ్రాఫర్‌: ఆమిర్‌, సంగీతం: ఎస్‌.కె.బాజీ.

Updated Date - Jul 15 , 2024 | 02:51 AM