భామా కలాపం 2లో అన్నీ డబుల్ ఉంటాయి
ABN, Publish Date - Feb 15 , 2024 | 02:49 AM
ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ‘భామా కలాపం 2’ వెబ్ సిరీస్ ఈ నెల 16 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మజీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు...
ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ‘భామా కలాపం 2’ వెబ్ సిరీస్ ఈ నెల 16 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మజీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను బాపినీడు, సుధీర ఈదర నిర్మించారు. ఈ సందర్బంగా ఏర్పాటైన ప్రెస్‌మీట్‌లో ప్రియమణి మాట్లాడుతూ ‘ఇందులో అన్నీ డబుల్ ఉంటాయి. థ్రిల్స్, ట్విస్టులతో పాటు కాస్త డేంజర్ కూడా ఉంది. ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంది. మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని చెబుతున్నాం’ అన్నారు. మొదటి పార్ట్ చూసి రెండో పార్ట్ చూస్తే ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతారని దర్శకుడు అభిమన్యు చెప్పారు. ఇందులో తనకు జుబేదా పాత్ర ఇచ్చిన దర్శకుడికి సీరత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సిరీస్ కోసం ఎంతో కష్టపడ్డామని మరో నటి శరణ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆహా బిజినెస్ హెడ్ వాసు, ఎడిటర్ విప్లవ్ కూడా పాల్గొన్నారు.