అందరూ మా ఎత్తు గురించి మాట్లాడుకున్నారు

ABN , Publish Date - May 02 , 2024 | 04:36 AM

‘నాన్నగారు డైరెక్ట్‌ చేసిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం టైటిల్‌నే మా సినిమాకూ పెట్టడంతో పోలిక వస్తుందేమో అనుకున్నాం. కానీ ఆ సినిమాకూ మా చిత్రానికీ సంబంధం లేదు..

అందరూ మా ఎత్తు గురించి మాట్లాడుకున్నారు

‘నాన్నగారు డైరెక్ట్‌ చేసిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం టైటిల్‌నే మా సినిమాకూ పెట్టడంతో పోలిక వస్తుందేమో అనుకున్నాం. కానీ ఆ సినిమాకూ మా చిత్రానికీ సంబంఽధం లేదు. ఈ సినిమాకు మొదట ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ సహా రకరకాల టైటిల్స్‌ అనుకున్నాం. చివరకు ఈ టైటిల్‌ ఫిక్స్‌ చేశాం. కథకు యాప్ట్‌ టైటిల్‌ ఇది’ అన్నారు ‘అల్లరి’ నరేశ్‌. ఆయన నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాకు చిత్ర విశేషాలు వెల్లడించారు.

  • ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. కథలో కామెడీ ఉంటే ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో దర్శకుడు మల్లి ఈ కథతో వచ్చారు. నాకు చాలా నచ్చింది. పెళ్లి చుట్టూ జరుగుతున్న కోట్ల రూపాయల వ్యాపారాన్ని వినోదాత్మకంగా ఈ చిత్రంలో చూపించాం. సినిమా అంతా నవ్విస్తూ చివరి రెండు రీళ్లలో ఎమోషనల్‌గా ఉంటుంది. నాన్నగారి చిత్రాల్లో అంతర్లీనంగా మంచి సందేశం ఉంటుంది. ఈ సినిమాలో చూపించే సందేశం ప్రేక్షకులను కదిలిస్తుంది.


  • కథ ఫైనలైజ్‌ చేసిన తర్వాత హీరోయిన్‌గా ఫరియాను అనుకున్నాం. ఆమెకు కూడా కథ నచ్చింది. తను సెట్‌కి వచ్చిన తర్వాత అందరూ మా ఎత్తు గురించి మాట్లాడుకున్నారు. ఫరియా మంచి నటి, డాన్సర్‌. కామెడీ సెన్స్‌ ఉంది. మా జోడీ బాగుంటుంది.

  • కామెడీ చేసి నవ్వించడం చాలా కష్టం. ఈ మధ్య సినిమాల్లో ఫైట్లు చేసి మోకాళ్ల నొప్పులు వచ్చాయి. మళ్లీ కామెడీ చేయడం హ్యాపీగా ఉంది. కామెడీ చిత్రాలకు ఇదివరకటి కంటే ఆదరణ పెరిగింది. కంటెంట్‌, హ్యూమర్‌ బాగుంటే ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ఇకపై కామెడీ చిత్రాలకూ ప్రాధాన్యం ఇస్తాను.

Updated Date - May 02 , 2024 | 04:36 AM