జీబ్రా అందరికీ నచ్చుతుంది
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:30 AM
సత్యదేవ్, కన్నడ నటుడు డాలీ ధనుంజయ నటిస్తున్న ‘జీబ్రా’ చిత్రం టీజర్‌ను హీరో నాని విడుదల చేశారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఎస్‌ఎన్ రెడ్డి, పద్మజ, బాలసుందరం, దినేశ్ సుందరం ఈ చిత్రాన్ని...
సత్యదేవ్, కన్నడ నటుడు డాలీ ధనుంజయ నటిస్తున్న ‘జీబ్రా’ చిత్రం టీజర్‌ను హీరో నాని విడుదల చేశారు. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఎస్‌ఎన్ రెడ్డి, పద్మజ, బాలసుందరం, దినేశ్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీజర్ విడుదల కార్యక్రమానికి అతిధిగా వచ్చిన మంచు మనోజ్ మాట్లాడుతూ ‘టీజర్ అదిరిపోయింది. ఈ చిత్ర నిర్మాత ఎన్నెస్ రెడ్డి నా శ్రేయోభిలాషి. బాగా ఖర్చుపెట్టి సినిమా తీశారు. నా అభిమాన నటుడు సత్యదేవ్. ఈ సినిమా ఘన విజయం సాధించాలి’ అన్నారు. హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ‘ఓ కొత్త క్యారెక్టర్‌తో వస్తున్నా. అన్ని పరిశ్రమల్లోని ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇందులో ఉన్నారు. ప్రతి వ్యక్తికి ఈ సినిమా నచ్చుతుంది’ అన్నారు.