అందరికీ నచ్చుతుంది

ABN , Publish Date - Jun 03 , 2024 | 06:53 AM

యానియా, అంకిత, అజయ్‌, కబీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం ‘ఇంద్రాణి’. ఈ సూపర్‌ ఉమెన్‌ సినిమాను స్టీఫెన్‌ పల్లం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు...

అందరికీ నచ్చుతుంది

యానియా, అంకిత, అజయ్‌, కబీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం ‘ఇంద్రాణి’. ఈ సూపర్‌ ఉమెన్‌ సినిమాను స్టీఫెన్‌ పల్లం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 14న విడుదలవుతున్న సందర్భంగా ఆదివారం ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. స్టీఫెన్‌ పల్లం మాట్లాడుతూ ‘‘ఇందులో చాలా అద్భుతమైన కంటెంట్‌ ఉంది. టాప్‌ క్లాస్‌ వీఎ్‌ఫఎక్స్‌ వర్క్‌ ప్రేక్షకులని అలరిస్తుంది. వందేళ్ల తర్వాత ప్రపంచంలో ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉంటుందో చూపించాం. అందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు. కబీర్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘‘సినిమాని విజువల్‌ వండర్‌లా డైరెక్టర్‌ తీర్చిదిద్దారు. ఇందులో సూపర్‌ విలన్‌గా నటించాను’’ అని చెప్పారు.

Updated Date - Jun 03 , 2024 | 06:53 AM